సెంట‌ర్‌లో చంద్ర‌బాబు…

ఏపీలో అధికార ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. టిడిపి అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడును ఉద్దేశించి మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు బ్రోక‌ర్ అని, ఆయ‌న అధికారంలోకి వచ్చే చాన్సే లేద‌న్నారు.

ఇక మంత్రి వ్యాఖ్య‌ల‌పై మాజీ మంత్రి దేవినేని ఉమ కౌంట‌ర్ ఇచ్చారు. బాధ్య‌త గ‌ల మంత్రి ప‌దవిలో ఉన్న వ్య‌క్తి సంస్కార‌హీనంగా మాట్లాడుతున్నార‌న్నారు. కొడాలి నాని మాట‌ల‌కు ఎవ్వ‌రూ భ‌య‌ప‌డ‌ర‌న్నారు. త‌న‌ను, చంద్ర‌బాబును తిట్టి మీ అస‌మ‌ర్థ‌త‌ను క‌ప్పిపుచ్చుకోవాల‌ని అనుకుంటున్నారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌మ ప్ర‌భుత్వ హాయంలో జ‌రిగిన అభివృద్ధిని ఈ ప్ర‌భుత్వం ముందుకు తీసుకెళ్ల‌డం లేద‌న్నారు.

కేవ‌లం త‌మ‌పైన వ్యక్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నార‌న్నారు. చంద్ర‌బాబు వ‌య‌స్సు గురించి, చావుల గురించి మాట్లాడి చేసిన త‌ప్పులు క‌న‌ప‌డ‌కుండా పోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. కొడాలి బెదిరింపుల‌పై డీజీపీ సుమోటోగా కేసు న‌మోదు చేయాల‌న్నారు. అంత‌కుముందు కొడాలి నాని చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో ద్వ‌జ‌మెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here