టిడిపి కొత్త అధ్యక్షుడా..? మ‌రి చంద్ర‌బాబు

తెలుగుదేశం పార్టీలో కొత్త అల‌జ‌డి మొద‌లైంది. చంద్రబాబునాయుడు ఇక పార్టీలో మార్పులు చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఏపీ రాష్ట్ర అధ్య‌క్ష్య ప‌ద‌వి విష‌యం పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది.

2019లో ఎన్నిక‌ల ఓట‌మి త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగానే ఉంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్ల ఇప్పుడు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు ర‌వీంద్రలు కేసుల్లో ఇరుక్కున్నారు. ఇక రాష్ట్రంలో బ‌లంగా పార్టీ గొంతుక‌ను వినిపించేందుకు స‌రైన నాయ‌కులు కూడా లేరు.

ఈ ప‌రిస్థితుల్లో ఇప్పుడు ఏపీ అధ్య‌క్ష్య ప‌ద‌వి మార్పు త‌థ్యంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టి అధ్య‌క్ష్యుడు క‌ళా వెంక‌ట్రావు ను త‌ప్పించి ఈయ‌న స్థానంలో అచ్చెన్న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు అనుకుంటున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్రంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఎందుకంటే ఇటీవ‌ల వైసీపీపై తీవ్ర స్థాయిలో ద్వ‌జ‌మెత్తుతూ పోరాడుతున్న వ్య‌క్తి అచ్చెన్నాయుడు మాత్ర‌మే.

చంద్ర‌బాబు వార‌సుడిగా లోకేష్ బాబు ఏమాత్రం రాజ‌కీయాల్లో రాణిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పన‌క్క‌ర్లేదు. ప‌క్క‌నున్న తెలంగాణాలో కేటీఆర్ ఏ విధంగా ఉన్నారో ఇక్క‌డ లోకేష్ ఏ విధంగా ఉంటారో ఎవ్వ‌రిన‌డిగినా తేడా చెబుతారు. ఇక‌ చంద్ర‌బాబు నాయుడు కూడా క‌రోనా ప‌రిస్థితుల్లో కేవ‌లం జూమ్ మీటింగుల‌కే పరిమితం అయ్యారు. ఇలాంటి త‌రుణంలో క‌చ్చితంగా అచ్చెన్నాయుడు లాంటి నాయ‌కుడిని అద్యక్ష్యుడిని చేస్తే పార్టీ త‌రుపున మాట్లేడే గ‌ట్టి స్వ‌రం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని అంతా అనుకుంటున్నారు. లేదంటే రానున్న రోజుల్లో పార్టీ గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కోక‌త‌ప్ప‌ద‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికే గ్ర‌హించారు. మ‌రి ఏపీ టీడీపీ అధ్య‌క్షుడి విష‌యంలో ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here