దీపం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు

సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్లు హడావిడి చేస్తుంటారు. అరె సాయంత్రం అవుతుంది. ఇల్లు శుభ్రం చేసి దీపాలు పెట్టండర్రా ఇంట్లో లక్ష్మీదేవి కళకళలాడుతుంది. ఇల్లంతా శుభ్రం చేసి దీపం పెట్టిన తరువాత గోళ్లు కత్తిరించకూడదని ,ఏడ్వకూడదని, తలదువ్వకూడదని, సంధ్యా సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసుకోవాలనిఇలా అనేకం చెబుతుంటారు. దీపాలు పెట్టేవేళ ఇంటి తలుపులు తెరిచి ఉంచాలని రకరకాల ఆంక్షలు విధిస్తారు.

వాళ్లు అలా ఎందుకు చెబుతున్నారో అర్ధం కాకపోయినప్పటికి నొప్పించడం ఇష్టంలేక అన్నీ చేస్తుంటాం. అయితే ఇలా పెద్దవాళ్లు చెప్పడం వెనుక ఓ అర్ధం పరమార్దం దాగిఉందని పండితులు చెబుతున్నారు. సాయంత్రం వేళ జేష్ఠ్యాదేవి వెనుక ద్వారం నుంచి , లక్ష్మీదేవీ ముందు ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకే సంధ్యా సమయంలోపల వెనుక ఉన్న తులుపుల్ని మూసి వేసి ముందు తలుపుల్ని తెరవాలని సూచిస్తారు. ఇంటికి చుట్టాలొస్తుంటే ఎంత హడావిడి చేస్తామో…అలాంటిది లక్ష్మీదేవి వస్తుంటే ఇంకెన్ని జాగ్రత్తులు తీసుకోవాలి. అందుకే పెద్దవాళ్లు ఇలా అంటుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here