భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు..

భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి రోజురోజుకూ తీవ్ర‌రూపం దాల్చుతోంది. లాక్‌డౌన్‌లో అంతా కంట్రోల్‌లో ఉన్న‌ట్టుగానే అనిపించినా..అన్‌లాక్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి కేసులు ఎక్కువ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. ప్ర‌తి రోజూ 30వేల‌కు పైగా కేసులు న‌మోద‌వ్వ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

తాజా కేసుల తీవ్ర‌త‌ను ప‌రిశీలిస్తే దేశంలో సామాజిక వ్యాప్తి మొద‌లైన‌ట్లు అనిపిస్తోంద‌ని ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్‌వ (ఐ.ఎం.ఏ) పేర్కొంది. ప‌ట్ట‌ణాల నుంచి గ్రామాల‌కు ధావాణంలా వ్యాపిస్తున్న క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం క‌ష్ట‌మైన ప‌నిగా అభివర్ణించింది. దేశ వ్యాప్తంగా ఆదివారం 38,902 కేసులు న‌మోదై రికార్డు సృష్టించాయి. గ‌డిచిన వారం రోజుల్లోనే 4,142 మంది మృత్యువాత‌ప‌డ్డారు. రికార్డు స్థాయిలో 23,672 మంది కోలుకోవ‌డం కూడా సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మే.

దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో కేసులు న‌మోద‌వుతువుతుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండో స్థానంలో ఉంది. ప్ర‌తి నిమిషానికి ముగ్గురు క‌రోనా బారిన ప‌డుతున్నారు. రాష్ట్రంలో సేక‌రిస్తున్న క‌రోనా శాంపిల్స్‌లో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌త 20 రోజుల కేసుల వివ‌రాలు ప‌రిశీలిస్తే మొద‌ట్లో సేక‌రిస్తున్న శాంపిల్స్లో 8 శాతం పాజిటివ్ వ‌స్తుండ‌గా.. ఇప్పుడు ఏకంగా రెట్టింపై 16 శాతం పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి.

న‌గ‌రాలు, పట్ట‌ణాల్లోనే కాకుండా గ్రామాల్లో కేసులు న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనా నివార‌ణ చ‌ర్య‌లు క‌ట్టుదిట్టం చేసింది. ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రాకుండా ఉండేలా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న విష‌యం తెలిసిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here