ఏం మాయ చేసాడో మరి..ఆ హీరోతో త్రిషా పెళ్లి..?

హీరోయిన్ త్రిషాపై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆమె హీరో శింబుని పెళ్లి చేసుకోనున్నారట. పెద్దలు కూడా వీరిద్దరి పెళ్ళికి ఒప్పుకున్నారని, త్వరలోనే పెళ్లి భాజా మోగుతుందని గట్టిగా విపిస్తుంది. హీరోయిన్ త్రిషా వయసు 30 ప్లస్ దాటి చాలా కాలం అవుతుంది.2015లో త్రిషా వరుణ్ అనే ఓ పారిశ్రామిక వేత్తతో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. కారణం ఏదైనా ఆ పెళ్లి ఆగిపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు త్రిషా పై పెళ్లి పుకార్లు రావడం జరిగింది.

ఇక శింబు ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపారు. నయనతార, హన్సికలతో ఆయన ప్రేమ బంధం పెళ్లివరకు వెళ్లి ఆగిపోయింది. కాగా త్రిషా శింబు ఏమాయ చేశావే తమిళ్ వర్షన్ లో కలిసి నటించారు. తెలుగులో ఆ మూవీ చేసిన నాగ చైతన్య, సమంత పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి త్రిషా, శింబు కూడా పెళ్లి చేసుకుంటే…గౌతమ్ మీనన్ నిజంగా ఎదో మాయ చేశాడు అనుకోవాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here