కంగనా సినిమా కోసం అసెంబ్లీ సెట్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా ‘తలైవి’ అనే బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ లో ప్లాన్ చేస్తోన్న షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ మరియు కంగనా మీద అసెంబ్లీ సన్నివేశాలను షూట్ చేయనున్నారు. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలలో అసెంబ్లీలో ఆమె పై జరిగిన దాడి ఒకటి. ప్రస్తుతం చెన్నైలోని ఓ స్టూడియోలో అసెంబ్లీ సెట్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే కంగనా రనౌత్ లాంటి నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో కంగనాను తీసుకున్నారు. మరి ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్‌ జయలలిత పాత్రను ఎలా మెప్పిస్తోందో చూడాలి.

బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. ఈ బయోపిక్ లో మిగిలిన కీలకమైన పాత్రలు ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు. ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటించబోతుండగా..అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here