న‌న్నే నియ‌మించాలి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్‌ను క‌లిశారు. హైకోర్టు సూచ‌న మేర‌కు ఆయ‌న నేడు రాజ్ భ‌వ‌న్‌లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశారు. ప్ర‌స్తుతం నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ నియామకం వ్య‌వ‌హారం సుప్రీంకోర్టు ప‌రిధిలో న‌డుస్తోంది.

అయితే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వ‌నందున త‌న‌నే నియ‌మించాల‌ని ర‌మేష్ కుమార్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లవాల‌ని హైకోర్టు ర‌మేష్ కుమార్‌కు సూచించిన విష‌యం తెలిసిందే. దీంతో నేడు ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి త‌న నియామ‌కంపై రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు స‌రైంది కాద‌ని పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది. హైకోర్టు చెప్ప‌టిన‌ప్ప‌టికీ త‌న‌ను నియ‌మించలేద‌ని వివ‌రించిన‌ట్లు స‌మాచారం. అయితే మ‌రో రెండు వారాల్లో సుప్రీంలో ర‌మేష్‌కుమార్ వ్య‌వ‌హారం తెర‌ప‌డే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ర‌మేష్ కుమార్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌డం ఆస‌క్తిగా మారింది.

ఫైన‌ల్‌గా ఇప్పుడు గవ‌ర్న‌ర్ ఏవిధంగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఎందుకంటే ఇప్ప‌టికే హైకోర్టు ర‌మేష్ కుమారే ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్‌గా ఉండాల‌ని చెప్పిన నేప‌థ్యంలో సుప్రీంకోర్టు ఏం చెప్ప‌నుందో మ‌రి కొద్ది రోజుల్లో తెలియ‌నుండ‌టంతో గ‌వ‌ర్న‌ర్ సీన్ ఎలా ఉంటుందోన‌ని అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here