క‌రోనా కొత్త నిబంధ‌న‌లు.. 10 గంట‌ల పాటు జైలు శిక్ష‌..

దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు క‌రోనా క‌ట్టడికి కావాల్సిన చ‌ర్య‌ల‌న్నీ తీసుకుంటున్నాయి. మ‌హారాష్ట్రలో కేసులు ఎక్కువ‌గా ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌భుత్వం మాస్క్ క‌చ్చితంగా పెట్టుకోవాల‌ని సీరియ‌స్‌గా చెప్పింది.

ఇక ఇప్పుడు ఢిల్లీలో కూడా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ప్ర‌జ‌లు సామాజిక దూరం పాటించి మాస్క్ పెట్టుకోవాల‌ని సూచిస్తోంది. ఇప్పుడు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కూడా క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. ఉజ్జయిని కలెక్టర్ ఆశీష్ సింగ్ ఆశానుసారం మాస్క్ పెట్టుకోకుండా ఎవరైనా కనిపిస్తే పోలీసులు వారిని అదుపులోకి తీసుకోనున్నారు. మాస్క్ ధరించని వారిని 10 గంటల పాటు జైలులో ఉంచనున్నారు. ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ కరోనా కట్టడికి ప్రత్యేక గౌడ్‌లైన్స్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ కరోనా కట్టడి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించారు. మాస్క్ పెట్టుకోనివారిపై, సోషల్ డిస్టెన్స్ పాటించనివారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం పోలీసులు ఇంటింటికీ వెళ్లి కరోనా బాధితుల వివరాలు తెలుసుకోవాలని, వారు బయట తిరగకుండా చూడాలని కలెక్టర్ కోరారు. కాగా ఉజ్జయిని జిల్లాలో కొత్తగా 3,944 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 3,703 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. జిల్లాలో కరోనా కారణంగా ఇప్పటివరకూ 97 మంది మృతి చెందారు. ప్రస్తుతం 144 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here