చేప‌ల్లో క‌రోనా వైర‌స్ ఉంద‌ని చెబుతోన్న చైనా..

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ రోజురోజుకూ భ‌య‌బ్రాంతుల‌ను చేస్తూనే ఉంది. ఇప్ప‌టికే రెండో విడ‌త క‌రోనా తీవ్ర‌రూపం దాల్చుతుంద‌ని ప్ర‌చారం ఎక్కువైంది. అయితే కొత్త‌గా ఆహార ప‌దార్థాల్లో కూడా క‌రోనా ఉంద‌న్న వార్త‌లు మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి.

తాజాగా చేప‌ల్లో క‌రోనా ఉంద‌ని చైనా చెబుతోంది. అందుకే చైనాకు వ‌స్తున్న దిగుమ‌తుల‌ను చైనా ఆపేసింది. ఇందులో ఇండియా నుంచి వెళ్లే దిగుమ‌తులు చైనా ఆపేసింది. ఇండియా నుంచి దిగుమ‌తి చేసుకున్న చేప‌ల్లో చైనా క‌రోనా వైర‌స్‌ను గుర్తించింది. ఇండియాలోను బ‌సు ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీ నుంచి ఈ చేప‌లు చైనాకు ఎగుమ‌తి అవుతున్నాయి. చైనా అక్క‌డ వీటిని ప‌రీక్షించ‌గా క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు తేలిన‌ట్లు ఆంగ్ల వార్తా సంస్థ రాయిట‌ర్స్ వెల్ల‌డించింది. దీంతో ఆ కంపెనీ దిగుమ‌తుల‌ను చైనా నిలిపివేసింద‌ని తెలుస్తోంది.

గ‌ట్ట‌క‌ట్టిన క‌టిల్‌ఫిష్ ప్యాకేజీలో మూడు శాంపిల్స్‌లో వైర‌స్ ఉన్న‌ట్లు క‌స్ట‌మ్స్ అధికారులు గుర్తించార‌ని తెలుస్తోంది. అందుకే ఈ దిగుమ‌తుల‌పై వారం పాటు నిషేధం విధించినట్లు ప‌త్రిక పేర్కొంది. అయితే చైనా ఇలా దిగుమ‌తుల‌ను నిలిపివేయ‌డం ఒక్క ఇండియా కంపెనీల‌కు మాత్ర‌మే కాకుండా ఇండోనేషియా, బ్రెజెల్, ఈక్వెడార్, ర‌ష్యా దేశాల నుంచి వ‌స్తున్న ఆహార ప‌దార్థాల‌ను కూడా ప‌రీక్షించింది. వీటిలో బ్రెజిల్‌, ఈక్వెడార్ దేశాల నుంచి వ‌స్తున్న ఆహార‌ప‌దార్థాల్లో కూడా వ్యాధికార‌క వైర‌స్ ఉన్న‌ట్లు గుర్తించింది. అప్పుడు కూడా ఈ దేశాల నుంచి వ‌స్తున్న దిగుమ‌తుల‌ను ఆపేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here