షాకింగ్ సీన్‌.. ట్రంప్‌కు దూరంగా ఉంటూ సైనికుడి చేయి ప‌ట్టుకొని న‌డిచిన మెలానియా..

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓట‌మి చ‌విచూసిన ట్రంప్‌కు అప్ప‌టి నుంచి టైం ఏమీ బాగోలేద‌ని అనిపిస్తోంది. ఇటీవ‌ల ఓ ప్ర‌చారం ఊపందుకుంది. అదేమిటంటే.. ట్రంప్ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత ఆయ‌న భార్య మెలానియా ట్రంప్‌కు విడాకులు ఇస్తుంద‌ని ప్ర‌చారం బాగా జ‌రుగుతోంది.

అయితే ఇది నిజ‌మే కాదో కానీ.. జ‌రుగుతున్న ప‌రిణామాలు మాత్రం ట్రంప్‌కు వ్య‌తిరేకంగానే ఉన్నాయి. వెటరన్స్ డే సందర్భంగా ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి ఆర్లింగ్టన్ జాతీయ స్మశానవాటికను సందర్శించారు. అమెరికా ఆర్మీలో సేవలందించిన వారిని స్మరించుకునేందుకు ప్రతి ఏడాది నవంబర్ 11వ తేదీన వెటరన్స్ డేను జరుపుతారు. ఈ కార్య‌క్ర‌మంలో మెలానియా ప్ర‌వ‌ర్త‌న విచిత్రంగా అనిపించింది. ఆమె కార్య‌క్ర‌మంలో మొత్తం ట్రంప్‌కు దూరంగానే ఉన్నారు. ఇదే స‌మ‌యంలో ఓ సైనికుడి చేయి ప‌ట్టుకొని ఆమె న‌డిచారు. దీన్ని చూసిన వారంతా షాక్‌కు గుర‌య్యారు. మొద‌ట్లో అలా ఉన్నాత‌ర్వాతైనా ట్రంప్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తార‌ని అనుకున్న వారికి చివ‌రి వ‌ర‌కు ఆ ద‌ర్శ‌నం క‌ల‌గ‌లేదు.

ఒక‌వేళ నిజంగా ఆమె ట్రంప్ నుంచి విడాకులు కోరుకుంటున్నారా అన్న‌ట్లు ఈ సీన్ క‌నిపిస్తోంది. ఇక ట్రంప్ నుంచి ఆమె విడాకులు తీసుకుంటే మాత్రం భారీగా భ‌ర‌ణం తీసుకోనుంద‌ని తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇంకా చెప్పాలంటే బయట కూడా అంతగా కనిపించలేదు. సోషల్ మీడియా వేదికగానే ఆయన ఎన్నికల ఫలితాలు, ఇతర విషయాలపై స్పందిస్తున్నారు. కేవలం రెండు సార్లు మాత్రం ఆయనకు ఎంతో ఇష్టమైన గోల్ఫ్ ఆడుకుంటూ బయట కనిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here