సినిమా పేరు చెప్ప‌కుండా దివాళీ శుభాకాంక్ష‌లు చెప్పిన హీరో నాని టీం..

నేచుర‌ల్ స్టార్ నాని ఫుల్ బిజీగా ఉన్నారు. వ‌రుస హిట్ల‌తో దూసుకెళుతూ యూత్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌ను కూడా నాని ఆక‌ట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయ‌న మూడు సినిమాల్లో చేసేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. త‌న 26వ సినిమా ట‌క్ జ‌గ‌దీష్‌ని ఎలాగైనా ఫినిష్ చేయాల‌ని నాని ఫుల్ బిజీగా ఉన్నారంట‌.

ఆ త‌ర్వాత వెంట వెంట‌నే మ‌రో రెండు సినిమాల‌ను ఆయ‌న లైన్‌లో పెట్టేశారు. 27వ సినిమా రాహుల్‌ సంక్రిత్యాన్ డైరెక్ష‌న్‌లో చేస్తున్నారు. శ్యామ్‌ సింగరాయ్ టైటిల్ అన్న విష‌యం తెలిసిందే. దీని షూటింగ్ ఇంకా మొద‌లు పెట్ట‌నేలేదు. అప్పుడే 28 సినిమా గురించి ఫుల్ క్లారిటీతో నాని ఉన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నాని 28వ సినిమా రానుంది. డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తీస్తున్నారు. మెంట‌ల్ మ‌దిలో, బ్రోచేవారెవ‌రురా వంటి సినిమాల‌తో వివేక్ మంచి ఫామ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు నానితో ఈ ప్రాజెక్టు చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా మలయాళీ భామ నజ్రీయా నజీమ్‌ను తీసుకోనున్నారు. అయితే మూవీ టైటిల్ ఇంకా ఫిక్స్ చేయ‌లేదు. దీపావ‌ళి త‌ర్వాత అంటే.. ఈ నెల 21వ తేదీన సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలుస్తాయ‌ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ చెబుతోంది. మొత్తానికి నానితో హిట్ కొట్టేయాల‌ని ఇటు మూవీ టీంతో పాటు అభిమానులు కూడా సిద్దంగా ఉన్నారు. ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here