చాయ్‌వాలా మోదీ.. ఆస‌క్తిక‌ర విష‌యాలు..

భార‌త దేశ చ‌రిత్ర‌లో చెరిగిపోని ఎన్నో నిర్ణ‌యాలు తీసుకున్నారు. తాను న‌మ్మిన సిద్ధాంతం కోసం అహ‌ర్నిష‌లు క‌ష్ట‌ప‌డ్డారు. అత్య‌ధిక కాలం ప్ర‌ధానిగా ప‌నిచేసిన వ్య‌క్తుల్లో స్థానం సంపాదించుకున్నారు. నేడు న‌రంద్ర మోదీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు.

1950 సెప్టెంబ‌ర్ 17వ తేదీన గుజ‌రాత్‌లోని మెహ్సానా జిల్లాలో వాద్‌న‌గ‌ర్‌లోని ఒక మ‌ధ్య త‌ర‌గతి కుటుంబంలో మోదీ జ‌న్మించారు. హీరాబా మోదీ, దామోద‌ర్ దాస్ మోదీ ఈయ‌న త‌ల్లిదండ్రులు. వీరికి ఆరుగురు సంతానం కాగా వీరిలో మూడ‌వ సంతానం న‌రేంద్ర‌మోదీ.

2001లో కేశూభాయ్ ప‌టేల్, ఉప ఎన్నిక‌ల‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఓట‌మికి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ రాజీనామా చేయ‌డంతో న‌రేంద్ర మోదీకి అధికారం ద‌క్కింది. అప్ప‌టి నుంచి 2014 వ‌ర‌కు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగారు. వ‌రుస‌గా నాలుగు సార్లు ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇక 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా ఎన్డీయేను విజ‌య‌వంతంగా న‌డిపించి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తిర‌గి 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధించి ప్ర‌ధాని అయ్యారు. ప్ర‌ధానిగా మోదీ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు చేయ‌డం, 370 అధిక‌ర‌ణ ర‌ద్దు, జీఎస్టీ అమ‌లు, త్రిపుల్ త‌లాక్ ర‌ద్దు, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం, జాతీయ పౌర జాబితా లాంటి నిర్ణ‌యాలు ఆయ‌న ప్ర‌భుత్వం తీసుకుంది.

మోదీ విద్యాబ్యాసం గురించి తెలుసుకుంటే వాద్‌న‌గ‌ర్‌లోనే హ‌య్య‌ర్‌, సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ పూర్తి చేశారు. ఆ త‌ర్వాత 1978లో యూనివ‌ర్శిటీ ఆఫ్ డిల్లీలోని స్కూల్ ఆఫ్ ఓపెన్ ల‌ర్నింగ్ నుంచి పొలిటిక‌ల్ సైన్స్‌లో బ్యాచిల‌ర్ డిగ్రీ పొందారు. 1983లో గుజ‌రాత్ యూనివ‌ర్శిటీ నుంచి డిస్టెన్స్ లో పొలిటిక‌ల్ సైన్స్‌లో మాస్ట‌ర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పొందారు. మోడీ తండ్రి స్థానిక రైల్వే స్టేష‌న్‌లో ఏర్పాటుచేసిన టీ స్టాల్లో టీ అమ్మేవారు. చిన్న‌ప్పుడు మోదీ ఈ టీ స్టాల్‌లోనే ఆయ‌న తండ్రికి స‌హాయంగా ప‌నిచేసేవారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కు మోదీ అక్క‌డే టీ స్టాల్‌ను ఏర్పాటుచేసుకొని టీ అమ్మారు. అందుకే మోదీని చాయ్ వాలా అంటారు.

మోదీ విద్యార్థి ద‌శ‌లోనే అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్ నాయ‌కుడిగా ప‌నిచేశారు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్‌.ఎస్‌.ఎస్‌)లో చేరి ఆ త‌ర్వాత బీజేపీలో సామాన్య కార్య‌క‌ర్త‌గా మోదీ చేరారు. ఆ త‌ర్వాత ఆయ‌న గుజ‌రాత్ సీఎంగా, దేశ ప్ర‌ధానిగా ఎదిగిపోయారు. మోదీ విద్యార్థి ద‌శ‌లో ఉన్న‌ప్పుడే ఆయ‌న‌లో నాయ‌కుడి ల‌క్ష‌ణాలు ఉండేవి. ఏదైనా విష‌యం గురించి స్నేహితులంతా మాట్లాడేట‌పుడు మోడీ అన‌ర్గ‌లంగా మాట్లాడేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here