విజృంభిస్తున్న క‌రోనా.. భార‌త్‌లో కొత్త‌గా ఎన్ని కేసులో తెలుసా..

క‌రోనా విజృంభిస్తూనే ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ కొన‌సాగుతోంద‌ని వైద్యులు అంటున్నారు. ఇండియాల్ కూడా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయ‌తే ఇక్క‌డ రిక‌వ‌రీల రేటు ఎక్కువ‌గా ఉంది.

ఇండియాలో కొద్ది రోజులుగా న‌మోద‌వుతున్న క‌రోనా కేసుల సంఖ్య 50వేల లోపే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 47,905 కరోనా కేసులు నమోదు కాగా.. 550 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 86,83,916కు చేరింది. 1,27,571 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 4,89,294 యాక్టివ్ కేసులుండగా.. కరోనా చికిత్స నుంచి కోలుకుని 80,66,302 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 92.32 శాతం కాగా.. మరణాల రేటు 1.49 శాతంగా ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేస్తూనే ఉంది.

ఇక దేశంలోని ప‌లు రాష్ట్రాల‌లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ప్ర‌ధానంగా వెసులుబాటు క‌ల్పించిన రంగాల్లో కేసులు న‌మోద‌వుతున్నాయి. ప్ర‌ధానంగా పాఠ‌శాల‌లు తెరిచిన నేప‌థ్యంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు పాఠ‌శాల‌ల‌ను మ‌ళ్లీ మూసివేసేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here