భార‌త్‌కు బ్యాడ్ న్యూస్‌.. మార్చి త‌ర్వాతే క‌రోనా వ్యాక్సిన్‌.

క‌రోనా వైర‌స్ కోసం కోటి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్న భార‌తీయుల‌కు బ్యాడ్ న్యూస్ వ‌చ్చింది. జ‌న‌వ‌రిలోనే అందుబాటులోకి వ‌చ్చేస్తుంద‌ని అనుకున్న క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ ఇంకా ఆల‌స్యం అవుతోంది. ఈ మేర‌కు ప‌రిశోధ‌న సంస్థ ప్ర‌క‌టించింది.

భార‌త వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి, నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ భాగ‌స్వామ్యంతో క‌రోనా వ్యాక్సిన్ త‌యారు చేస్తున్న విష‌యం తెలిసిందే. వీరు త‌యారుచేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌నుకున్న ఆశ‌లు ఉండేవి. అయితే మార్చి త‌ర్వాత‌నే ఇది అందుబాటులోకి వ‌స్తుంద‌ని భార‌త్ బ‌యోటెక్ అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల డైరెక్ట‌ర్ సాయిప్ర‌సాద్ తెలిపారు. ప్ర‌స్తుతం కోవాగ్జిన్ మూడో ద‌శ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

తుది ద‌శ ట్ర‌య‌ల్స్‌లో మంచి ఫ‌లితాలు రావాల‌ని.. ఆ త‌ర్వాత అన్ని అనుమ‌తులు తీసుకున్న త‌ర్వాత‌నే వ్యాక్సిన్‌ను విడుద‌ల చేస్తామ‌ని ఆయ‌న చెప్పారు. 2021 రెండో త్రైమాసికం అంటే మార్చి త‌ర్వాత‌నే దీన్ని విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. దీంతో క‌రోనా వ్యాక్సిన్ ఈ ఏడాది చివ‌ర్లో వ‌చ్చేస్తుంద‌ని అనుకున్న‌వారంతా షాక్‌కు గుర‌య్యారు. అయితే ప్ర‌పంచ దేశాల‌తో పోల్చుకుంటే భార‌త్‌లో ప‌రిస్థితులు ఆశాజ‌న‌కంగానే ఉన్నాయి. ఎందుకంటే ఇత‌ర దేశాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్‌డౌన్ విధిస్తున్నారు. కానీ మ‌న దేశంలో మాత్రం క‌రోనా కేసులు పెరుగుతున్నా రిక‌వ‌రీ రేటు మాత్రం 91 శాతం ఉంది. దీన్ని బ‌ట్టి వ్యాక్సిన్ కాస్త ఆల‌స్య‌మైనా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉండాల‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here