సినిమాల్లోకి మ‌రో వార‌సుడు.. హిట్ కొడ‌తాడా..

సినిమాల్లో వార‌సుల హ‌వా ఇప్ప‌టికి కాదు.. టాలీవుడు బాలీవుడ్ ఇలా ప్ర‌తి ఇండ‌స్ట్రీలో వార‌సులు వ‌స్తూనే ఉన్నారు. అయితే వీరిలో కొంద‌రు సొంత ఇమేజ్‌తో ఎదిగితే.. మ‌రికొంద‌రు త‌ల్లితండ్రుల ఇమేజ్‌తో ఇండ‌స్ట్రీలో ఆఫ‌ర్లు కొట్టేస్తున్నారు.

ఇప్పుడు ఇండ‌స్ట్రీలోకి మ‌రో వార‌సుడు ఎంట్రీ ఇచ్చారు. ఆయ‌నే క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి చెందిన దివంగ‌త సీనియ‌ర్ న‌టుడు కంఠీర‌వ రాజ్‌కుమార్ మ‌న‌వ‌డు యువ‌రాజ్‌కుమార్‌. ఇండ‌స్ట్రీలో అగ్ర కుటుంబంగా చెప్పుకునే ఈ ఫ్యామిలీ నుంచి ఈ యువ హీరో ఎంట్రీ ఇస్తున్నారు. రాజ్‌కుమార్‌ జయంతి సందర్భంగా యువ రాజ్‌కుమార్‌ నటిస్తున్న సినిమా యువ రణధీర కంఠీరవ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుద‌ల చేశారు. పునీత్ రుద్రాంగ్ ఈ సినిమాకు డైరెక్ష‌న్ చేస్తున్నారు. దీంతో పాటు ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు.

ఎంట్రీలోనే చారిత్ర‌క బ్యాక్‌గ్రౌండ్ ఉన్న సినిమాతో వ‌స్తున్నారు ఈ హీరో. మ‌రి ఈ వార‌సుడు ఎంట్రీతో ఇండ‌స్ట్రీలో టాక్ మొద‌లైంది. ఎంత‌మేర ఆక‌ట్టుకుంటారో అన్న డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. మ‌హామ‌హులు ఉన్న ఇండ‌స్ట్రీలో కొత్త వారు రాణించాలంటే వార‌స‌త్వంతో పాటు టాలెంట్ కూడా ఉండాల‌ని సినీ అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here