త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌న్న సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్‌ రెహ‌మాన్‌

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు అవ‌కాశాలు త‌క్కువ రావ‌డం వెనుక ఉన్న కుట్ర‌ల గురించి వివ‌రించారు రెహమాన్‌.

సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ గురించి తెలియ‌ని వారు ఉండ‌టంటే అతిశ‌యోక్తి కాదు. టాలివుడ్‌, బాలివుడ్‌, కోలివుడ్ ఇలా అన్ని చోట్లా ఆయ‌న రికార్డులు సృష్టించేశారు. టాప్ యాక్ట‌ర్స్ మూవీస్‌లో ఆయ‌న ఇచ్చిన సంగీతం ఓ రేంజ్‌లో హిట్ట‌య్యింది. ఇప్పుడు ఈయ‌న‌కు త‌క్కువ అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

దీనిపై రెహ‌మాన్ మాట్లాడారు. కావాల‌నే కొంద‌రు న‌న్ను టార్గెట్ చేసి త‌న‌ను బ్యాడ్ చేస్తున్నార‌ని చెప్పారు. ఓ గ్యాంగ్ త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తోంద‌న్నారు. నాపై అపార్థాల‌తో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ త‌న వ‌ర‌కు మంచి సినిమాలు రాకుండా చేస్తున్నార‌ని రెహ‌మాన్ అన్నారు. అంతే త‌ప్ప తాను ఏ మంచి సినిమాను రిజెక్ట్ చెయ్య‌లేద‌ని చెప్పారు. తాజాగా ఆయ‌న సుశాంత్ రాజ్‌పూత్ న‌టించిన దిల్ బేచారా సినిమాకు సంగీతం ఇచ్చారు. మ‌రి రెహ‌మాన్‌కు అవ‌కాశాలు ద‌క్క‌కుండా ఇలా ఎవ‌రు చేస్తున్నారో మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here