తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాల‌పై అత్య‌వ‌స‌ర స‌మావేశం..

తిరుమ‌ల‌లో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నాలు య‌థావిధిగానే కొన‌సాగ‌నున్నాయి. ఆగ‌ష్టు నెల‌కు సంబంధించి ఆన్ లైన్ టికెట్లు విడుదల చేశారు. దీంతో ద‌ర్శ‌నాలు నిలిపివేసే ఆలోచ‌న లేద‌ని అర్థమ‌వుతోంది.

తితిదేలే వంద మందికి పైగా క‌రోనా సోకిన‌ట్లు తెలుస్తోంది. వీరిలో చాలా మంది క్వారంటైన్‌లో ఉన్నారు. అలిపిరి గేట్ వ‌ద్ద కోవిడ్ పరీక్ష‌లు చేస్తున్న వారికి కూడా క‌రోనా సోకింది. దీంతో ఈ కేంద్రాలు కొద్ది రోజులు మూసివేసి ఇప్పుడు మ‌ళ్లీ తెరిచారు.

శ్రీ‌వారి కైంక‌ర్యాలు నిర్వ‌హించే అర్చ‌కుల‌కు క‌రోనా సోకింది. ఈ సంద‌ర్బంగా తితిదే పాల‌క‌మండ‌లి స‌మావేశ‌మైంది. ఇందులో అర్చ‌కుల అభిప్రాయాలు తీసుకుని, ఆగ‌ష్టులో మ‌ళ్లీ స‌మావేశం నిర్వ‌హించి ద‌ర్శ‌నాల‌పై క్లారిటీ ఇవ్వ‌నున్నారు. కాగా ఇప్ప‌టికే తిరుమ‌ల‌కు భ‌క్తుల తాకిడి త‌గ్గింది.

రోజుకు 9వేల మంది టోకెన్లు తీసుకుంటుండ‌గా.. ఇందులో స‌గం మంది మాత్ర‌మే ద‌ర్శ‌నాల‌కు వ‌స్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో భ‌క్తులు భ‌యందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నట్లు అర్థ‌మ‌వుతోంది. మ‌రి ద‌ర్శ‌నాల కొన‌సాగింపుపై దేవ‌స్థానం ఏం నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here