రికార్డుల వ‌రుస‌లో సుశాంత్ రాజ్‌పూత్ మూవీ

సుశాంత్ రాజ్‌పూత్ స‌జీవంగా లేక‌పోయినా రికార్డులు సృష్టిస్తున్నారు. ఓటీటీలో విడుద‌లైన సుశాంత్ మూవీ మంచి రెస్పాన్స్ సాధిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మూవీ చూసిన వారంతా పాజిటివ్ రేటింగ్ ఇస్తున్నారు.

దిల్ బేచారా మూవీ ఓటీటీలో విడుద‌లై మంచి ట్రెండింగ్‌లో ఉంది. డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌లైన ఈ సినిమా ప్ర‌స్తుతం ఓటీటీలో ఫామ్‌లో ఉంది. మూవీకి ప్ర‌ముఖ సినీ డేటాబేస్ వెబ్‌సైట్  10/10 రేటింగ్ ఇచ్చింది. ఇక సామాజిక మాధ్యమాల్లో దిల్ బేచారా ట్రెండ్ కొన‌సాగుతోంది.

అభిమానుల విషయానికొస్తే సుశాంత్ చివ‌రి సినిమాలో అద్బుతంగా న‌టించార‌ని చెబుతున్నారు. న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నార‌ని.. ఆయ‌న ఉండి ఉంటే సంతోషం వ్య‌క్తం చేసే వార‌ని అంటున్నారు. సుశాంత్‌, సంజ‌నా ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న ప‌లు స‌న్నివేశాలు అంద‌రినీ ఆకట్టుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here