ముద్దు సీన్ల గురించి ఇంట్లో చెప్పిన పాయ‌ల్ రాజ్‌పూత్‌ ..

బోల్డ్ పాత్ర‌ల గురించి ఇంట్లో ముందుగానే చెప్తాన‌ని హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పూత్ అంటున్నారు. త‌ల్లిదండ్రుల‌తో అన్ని విష‌యాలు చ‌ర్చిస్తాన‌ని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ‌.

ఆర్ ఎక్స్ 100, ఆర్డీఎక్స్ ల‌వ్ చిత్రాల్లో న‌టించి అభిమానుల‌ను సొంతం చేసుకున్నారీమె. ఆర్‌.ఎక్స్ 100 ల‌వ్ స్టోరీతో యువ‌త‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఏ సినిమా ఒప్పుకోవాల‌న్నా అమ్మా,నాన్న‌ల‌కు క‌థ చెప్తాన‌ని చెబుతోంది.

ఇక బోల్డ్ పాత్రల విష‌యాల గురించి కూడా ఇంట్లో క్లారిటీగా చెప్తానంది. సినిమాకు అవ‌స‌ర‌మైన‌ట్టు ఈ సీన్లు ఉంటాయ‌ని అమ్మ‌కు వివ‌రిస్తాన‌ని చెప్పారు పాయ‌ల్‌. అయితే త‌న మాట‌కు ఎప్పుడూ ఇంట్లో గౌర‌విస్తార‌ని.. త‌న‌కు న‌చ్చితే పాత్ర‌ను చేయ‌మ‌ని చెప్తార‌ని తెలిపింది.

కాగా ఎన్ని బోల్డ్ పాత్ర‌లు చేసినా త‌ల్లిదండ్రుల‌కు త‌న పాత్ర‌ను చూడ‌టం కాస్త ఇబ్బందిగానే ఉంటుంద‌ని.. అయిన‌ప్ప‌టికీ త‌న‌కేమీ చెప్పుకోర‌ని అంటోంది పాయ‌ల్ రాజ్‌పూత్‌. మ‌రి ఇన్నాళ్లు త‌న అందంతో కుర్ర‌కారును ఆక‌ట్టుకున్న ఈ భామ ఇక ముందు ఎలా క‌నిపిస్తారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here