ఇదే నిజ‌మైతే మెగా అభిమానుల‌కు పండ‌గే పండుగ‌..!

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీ నుండి వ‌చ్చిన హీరోలకు వ‌స్తున్న‌ క్రేజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మెగా బ్రాండ్ పేరుతో మ‌రో యువ‌ హీరో తెరంగ్రేటం చేయ‌నున్నారు. ‌ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కల్యాణ్‌దేవ్ ఇప్ప‌టికే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

చిరంజీవి సినిమా చ‌రిత్ర‌లో తిరుగులేని విజ‌యాన్ని అందించిన విజేత టైటిల్ తోనే క‌ల్యాణ్ దేవ్ సినిమా తీస్తున్నారు. ఇప్ప‌టికే అధికారికంగా ఈ పేరును ఖ‌రారు చేస్తూ లోగోను కూడా విడుద‌ల చేశారు. ఇక సినిమా త‌ర్వాత మ‌రో సినిమా తీసేందుకు క‌ళ్యాన్ రెడీ అవుతున్నార‌ట‌.

ఈ సినిమాను ఏకంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సొంత‌ నిర్మాణ సంస్ధ కొణిదెల ప్రోడ‌క్ష‌న్ కంపెనీ నిర్మించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఈ సినిమా వార్త‌ల‌పై ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీతో పాటులో మెగా అభిమానుల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఈ వార్త నిజ‌మైతే ఇక మెగా అభిమానుల‌కు పండుగే పండుగ అని చెప్ప‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here