సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన క‌రోనా

క‌రోనా ట్రెండ్ సెట్ చేస్తోంది. సాదార‌ణంగా పెళ్లంటే బంధువులు, ఆర్బాటాలు, న‌చ్చిన వంట‌లు, స‌ర‌దాగా సాగిపోతుంది. కానీ క‌రోనా వ‌చ్చేశాక అదంతా ప‌క్క‌కు వెళ్లిపోయింది.

తాజాగా కృష్ణా జిల్లా ముదినేప‌ల్లిలో ఓ వివాహ కార్య‌క్ర‌మంలో క‌నిపించిన సీన్ క‌రోనా త‌ర్వాత పెళ్లంటే ఇలానే ఉంటుదేమో అన్న‌ట్లు అనిపించేలా చేస్తోంది. ఎందుకంటే ఆ పెళ్లిలో పిపిఈ కిట్లు ధరిస్తూ ప‌లువురు క‌నిపించారు. ఇది చూసిన వారంతా వైర‌స్ పుణ్య‌మాని పెళ్లి ఇలా మారిపోయింద‌ని అనుకున్నారు.

మామూలుగా పెళ్లిలో బావ‌లు, మ‌ర‌ద‌ళ్లు, అత్త‌, మావ‌య్య‌లు ఇలా ఒక‌రికొక‌రు వ‌డ్డించుకుంటూ స‌ర‌దాగా గ‌డుపుతారు. పెళ్లి జ‌రిగిన‌న్ని రోజులు సంతోషంగా గ‌డుపుతూ ఉంటాం. కానీ ఈ పెళ్లిలో మాత్రం వ‌డ్డించేవారు పీపీఈ కిట్లు ధ‌రించి క‌నిపించారు. అంద‌రికీ వ‌డ్డించారు. పెళ్లిలో జాగ్ర‌త్త‌లు బాగానే తీసుకున్నార‌ని అంద‌రూ అనుకున్నారు. కాగా మ‌రి రాబోయే కాలంలో ఎవ‌రి పెళ్లి జ‌రిగినా ఇలానే చేయాలి లేదంటే పెళ్లి స‌రిగ్గా చేయ‌డం రాదా అని చ‌ర్చించుకుంటారు. అయితే ఈ పెళ్లిలో వ‌డ్డించింది మాత్రం క్యాట‌రింగ్ సిబ్బంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here