ఏపీలో ఆదాయం అప్పులపై పవన్ ఏమన్నారంటే.

 

ఏపీలో  ప్రభుత్వ వైఖరిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. బలమైన ప్రభుత్వం ఏర్పడినా ప్రజలిచ్చిన వరాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు.

ప్రభుత్వ బలాన్ని రాజకీయ కక్షల కోసం, ఓటు బ్యాంకు కోసం ఎందుకు వినియోగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. నాయకులు చేస్తున్న తప్పులకు అధికారులు బలవుతున్నారన్నారు. డిజిపి ఇన్ని సార్లు కోర్టుకు వెళ్లడం ఎప్పుడూ చూడలేదన్నారు.

ఇక ప్రజలకు పంచి పెట్టేందుకు అప్పులు చెయ్యాల్సి వస్తే దీన్ని అభివృద్ధి అని ఎలా అంటారన్నారు. గత పాలకులు రాష్ట్రంలో చాలా అప్పులు చేసారని.. ఇప్పుడు మరింత ఎక్కువ అవుతున్నాయన్నారు. ఆదాయం పెరగాల్సింది పోయి అప్పులు పెరుగుతున్నాయని పవన్ అన్నారు. ఇకనుంచైన వైసిపి నేతలు అభివృద్ధి వైపు వెళ్లాలన్నారు. ఇక కరోనా విషయంలో ముందు తేలికగా తీసుకున్నారని ఇప్పుడు ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here