డాక్ట‌ర్ల‌తో చంద్ర‌బాబు వ‌ర్చువ‌ల్ మీటింగ్‌….

ఏపీలో క‌రోనా వృద్దిరేటు ఎక్కువ‌గా ఉంద‌ని టిడిపి అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని ప్ర‌ముఖ వైద్యుల‌తో చంద్రబాబు వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించి క‌రోనా ప‌రిస్థితిపై మాట్లాడారు.

క‌రోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌ను కాపాడుకోవాల‌ని చంద్ర‌బాబు అన్నారు. వారి త్యాగాలు, సేవ‌లు వెల్ల‌క‌ట్టలేనివ‌ని కొనియాడారు. అధ్య‌య‌నాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రానికి పంపుతున్న‌ట్లు బాబు చెప్పారు. ఏపీలో గ‌త రెండు వారాల్లో కేసులు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న చంద్ర‌బాబ‌.. మృతుల్లో ఏపీ దేశంలోనే రెండ‌వ స్థానంలో ఉంద‌న్నారు.

ఇక ఎక్కువ మందిని ఒకే అంబులెన్సులో తీసుకొస్తున్నార‌ని.. దీని వ‌ల్ల క‌రోనా లేని వారికి కూడా సోకే ప్ర‌మాదం ఉంద‌న్నారు. స‌మాజాన్ని కాపాడేందుకు ప్ర‌తి ఒక్క‌రూ ముందుకు రావాల‌ని బాబు పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతానికి మందులు లేవ‌ని ప్ర‌జ‌లను అప్ర‌మ‌త్తం చేయాల‌న్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో వ‌స‌తులు ఉంటే రోగులు భ‌య‌ప‌డ‌కుండా ఉంటార‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనా విష‌యంలో తీసుకుంటున్న చ‌ర్య‌లు బాగున్నాయ‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. కోట్ల రూపాయ‌లు జ‌గ‌న్ క‌రోనా కోసం వెచ్చిస్తున్నారంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here