సెప్టెంబ‌రులో ఐపిఎల్ జ‌రుగుతుందా..

క్రికెట అభిమ‌నులంతా ఆశ‌లు వ‌దులుకున్న ఐపిఎల్ ఎలాగో జ‌రుగ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఐపిఎల్ నిర్వ‌హ‌ణలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప‌లువురు సూచన‌లు చేస్తున్నారు. క్రికెట‌ర్ల‌కు ప్ర‌తి రోజూ కోవిడ్ టెస్టులు చేయాల‌ని చెబుతున్నారు.

కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ స‌హ య‌జ‌మాని నెస్ వాడియా ఐపిల్ లో క్రికెట‌ర్ల‌పై కామెంట్లు చేశారు. క్రికెట‌ర్లు భార‌త్‌లో విమానం ఎక్కేముందు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని.. అలాగే దుబాయ్‌లో దిగిన త‌ర్వా కూడా పరీక్ష‌లు చేయించుకోవాల‌న్నారు. క‌రోనా విజృంభిస్తున్న వేళ ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకుంటే బాగుంటుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. సెప్టెంబ‌ర్ 19న మొద‌టి మ్యాచ్ జ‌రుగ‌నుంది.

బీసీసీఐ నిబంధ‌న‌ల కోసం ఎదురుచూస్తున్నామ‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌తి క్రికెట‌ర్ ప్ర‌తి రోజూ కోవిడ్ టెస్టు చేయించుకుంటే మంచిద‌న్నారు. ఐపిఎల్ విజ‌య‌వంతంగా నిర్వ‌హించాలంటే నిబంధ‌న‌లు క‌ఠినంగానే ఉండాల‌ని చెప్పారు. యుఏఈలో కూడా టెస్టు రేటింగ్ ఎక్కువ‌గానే ఉన్న నేప‌థ్యంలో బీసీసీఐ ఏ విధంగా చ‌ర్య‌లు తీసుకుంటుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here