త‌న పెళ్లి గురించి నిజాలు బ‌య‌ట‌పెట్టిన హీరో రానా

నైపుణ్యం ఉంటే ఇండ‌స్ట్రీలో ఎవ‌రైనా విజ‌యం సాధిస్తార‌ని హీరో రానా అన్నారు. జీవితంలో ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాన‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే ఆయ‌న పెళ్లిపీట‌లెక్క‌బోతున్నారు.

త్వ‌ర‌లోనే హీరో రానా ఓ ఇంటివాడు కాబోతున్నారు. మిహీకా బ‌జాజ్‌తో ఆగ‌ష్టు 8వ తేదీన ఆయ‌న వివాహం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్బంగా ఆయ‌న త‌న మ‌నసులోని మాట‌ను పంచుకున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఓటీటీ పెద్ద వేదిక కాబోతోంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. పౌరాణిక పాత్ర‌లంటే చాలా ఇష్ట‌మ‌న్నారు.

ఇక త‌న జీవితం గురించి మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకునేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌న్నారు. త‌న‌కు స‌రైన జోడీ మిహీకా అన్నారు. ప్ర‌తి విష‌యంలో తాము ఒక‌రికొక‌రం అండ‌గా ఉంటామ‌న్నారు. కాగా రానా వివాహం ఎప్పుడు చేసుకుంటాడా అని ఇండ‌స్ట్రీలో అంతా ఎదురుచూశారు. మొత్తానికి ఇప్పుడు ఆయ‌న‌కు పెళ్లి కుదిరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here