యంగ్ హీరో నాగ‌శౌర్య ఫోటో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

యంగ్ హీరో నాగ‌శౌర్య కొత్త లుక్‌తో దుమ్ములేపుతున్నాడు. విభిన్నంగా త‌న బాడీని చూపిస్తు క‌నిపిస్తున్న ఫోటో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

త‌న 20వ సినిమాను సంతోష్ జాగ‌ర్ల‌పూడితో చేయ‌నున్నారు నాగ‌శౌర్య‌. ఈ సినిమాకు సంబంధించి ప్రీలుక్‌ను ఆయ‌న విడుద‌ల చేశారు. పురాత‌న క్రీడ‌ల్లోని ఒక క్రీడ‌తో రానున్న‌ట్లు సందేశ‌మిచ్చారాయ‌న‌. ఈ సినిమాలో ఆయ‌న కొత్త‌గా కనిపిస్తున్నారని అంతా చ‌ర్చించుకుంటున్నారు.

కండ‌లు తిరిగిన వీరుడిలా నిల్చున్న ఫోటోను విడుద‌ల చేయ‌డంతో ఆయ‌న‌లో మ‌రో కోణం క‌నిపించింద‌ని చెప్పొచ్చు. ఈనెల 27వ తేదీన ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు చెప్పుకొచ్చారు. అశ్వ‌థ్థామ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న శౌర్య కొత్త సినిమా కోసం బాగానే క‌ష్ట‌ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. సో త‌న 20వ సినిమా ఏవిధంగా ఉంటుందో చూద్దాం మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here