సుశాంత్ సింగ్‌ చ‌నిపోయాక ఇలా జ‌రిగిందేంటి.

కెరీర్‌లో స‌క్సెస్ అందుకుంటున్న త‌రుణంలోనే త‌నువు చాలించిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ న‌టించిన చిత్రం దిల్ బెచ‌రా విడుద‌లైంది. ఆయ‌న న‌టించిన ఆఖ‌రిచిత్రం ఇదే. లాక్‌డౌన్ కార‌ణంగా రిలీజ్ కాలేక‌పోయిన ఈ సినిమాను చిత్ర బృందం ఓటీటీ ద్వారా విడుద‌ల చేసింది.

సుశాంత్‌కు జోడీగా సంజ‌న న‌టించిన ఈ సినిమాను ముఖేశ్ చ‌బ్రా ద‌ర్శ‌క‌త్వం చేశారు. ఓ న‌వ‌ల ద్వారా ఈసినిమాను తెర‌కెక్కించి.. ఓటీటీ వేదికైన డిస్నీ, హాట్‌స్టార్ వేదిక‌గా దీన్ని రిలీజ్ చేశారు. అయితే సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తోంది. సుశాంత్ సినిమాలో కూడా త‌న జీవితంలో జ‌రిగిన‌ట్టే కొన్ని అనుభ‌వాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు.

సినిమాలో మ‌నిషి జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియ‌దు కాబ‌ట్టి ఉనన్ని రోజులు ఎలా ఉండాలి. చివ‌రి క్ష‌ణాల్లో ఎలా బ్ర‌త‌కాల‌న్న కాన్సెప్టే ఉంది. దీన్న బట్టి చూస్తే సుశాంత్ చ‌నిపోయిన ప‌రిస్థితిని బ‌ట్టి ఆయ‌న మ‌దిలో ప‌లు ఆలోచ‌న‌లు ఉన్న‌ట్లు మ‌న‌కు అర్థ‌మ‌వుతోంది. సినిమా సుశాంత్ జీవితంపై ప్ర‌భావం చూపిందేమో అని ప‌లువురు సీనీ అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.

సినిమాలో సుశాంత్ న‌ట‌న బాగుందని చెబుతున్నారు. త‌న న‌ట‌న‌తో సినిమాకు సుశాంత్ జీవం పోశార‌ని పొగుడుతున్నారు. మ‌రి ఇప్పుడు సుశాంత్ ఉండి ఉంటే మంచి విజ‌యం ల‌భించింద‌ని సంతోష ప‌డేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here