స‌చిన్‌, ర‌విశాస్త్రిల సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన కొహ్లీ.

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు. ఆట‌లో ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌యంలో స‌చిన్‌, ర‌విశాస్త్రిలు త‌న‌ను గాడిలో పెట్టార‌ని ఓపెన‌య్యాడు.

2014లో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో తాను ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని విరాట్ చెప్పారు. అయితే ఆ అనుభ‌వంతో చాలా నేర్చుకున్న‌ట్లు తెలిపారు. ఓ రోజు స‌చిన్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి త‌న ఆట తీరు గురించి చెబితే ఆయ‌న అద్బుత‌మైన స‌ల‌హాలు ఇచ్చార‌ని కొహ్లీ అన్నాడు. దీంతో బాగా ప్రాక్టీస్ చేసి ఆ మెళ‌కువ‌లు నేర్చుకొని మంచి ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చిన‌ట్లు తెలిపాడు.

ఆ త‌ర్వాత‌ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో త‌న స‌త్తా చూప‌డానికి కార‌ణం స‌చిన్, ర‌విశాస్త్రి ప్రోత్సాహ‌మే అన్నారు. ఫాస్ట్ బౌల‌ర్ బంతిని వేయ‌గానే కుడి చేతివాటం బ్యాట్స్‌మెన్ త‌న ఎడ‌మ‌కాలిని ముందుకు రావ‌డంతో అత‌ని శ‌రీర బ‌రువు మొత్తం ముందుకు వ‌స్తుంద‌న్న విష‌యం తెలుసుకున్న‌ట్లు కొహ్లీ చెప్పారు. ఇక ర‌విశాస్త్రి పేస‌ర్ల బౌలింగ్‌లో క్రీజు బ‌య‌ట నిల‌బ‌డి బ్యాటింగ్ చేయ‌మ‌ని సూచించ‌గా.. అలాగే చేసిన‌ట్లు కొహ్లీ చెప్పారు. మొత్తానికి స‌చిన్‌, ర‌విశాస్త్రి స‌ల‌హాల‌తో ఉత్త‌మ టెస్టు క్రికెట‌ర్‌గా మారిన‌ట్లు కొహ్లీ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here