బిచ్చ‌గాడు మళ్లీ వస్తున్నాడు….!

ఇండ‌స్ట్రీలో సినిమాలు సూప‌ర్‌హిట్ కొట్టి మ‌ళ్లీ సీక్వెల్ దిశ‌లో వెళ్ల‌డం తెలిసిందే. అయితే ఇది కామ‌న్‌గా జ‌రిగే విష‌య‌మే. ఇప్పుడు ఇదే దారిలో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి స‌క్సెస్ క‌న‌బ‌ర‌చిన బిచ్చ‌గాడు సినిమా సీక్వెల్ రాబోతోంది.

విజ‌య్ ఆంథోని హీరోగా పిచ్చైక‌ర‌న్ పేరుతో త‌మిళ్‌లో 2016 మార్చిలో సినిమా రిలీజైంది. ఇదే మూవీ తెలుగులో మే నెల‌లో విడుద‌ల అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఇది మంచి విజ‌యం సాధించింది. ప‌లు ప్రాంతాల్లో వంద రోజులు కూడా ఆడింది. బుల్లి తెర‌లో కూడా బిచ్చ‌గాడు సినిమా మంచి ఆద‌ర‌ణ పొందింది. మా టీవీలో ఇది 18.75 టి.ఆర్‌.పి పాయింట్లు రేటింగ్ సాధించింది. తెలుగులో విజ‌య్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈ సినిమాతో వ‌చ్చింద‌ని చెప్పొచ్చు.

ఆంధ్ర‌, తెలంగాణాలో క‌లిపి రూ. 25 కోట్ల క‌లెక్ష‌న్లు సాధించింది బిచ్చ‌గాడు. ఇప్పుడు ఇదే మూవీ సీక్వెల్ రానుండ‌టంతో ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ‌త అభిమానుల్లో నెల‌కొంది. డైరెక్ట‌ర్ ప్రియ‌కృష్ణ‌స్వామి తెలుగు, త‌మిళ భాష‌ల్లో దీన్ని తీస్తున్నారు. విజ‌య్ బ‌ర్త్‌డే సంద‌ర్బంగా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here