ప్రాణం పోతున్నా బిర్యానీ వ‌ద‌ల్లేదు…!

దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎవ్వరి పనిలో వారు బిజీగా ఉంటారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కూడా భోజన ప్రియులు రికార్డు సృష్టిస్తున్నారు. ఆన్ లైన్ ఆర్డర్లపై మాత్రం మక్కువ తగ్గడం లేదు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ లో అత్యవసర పనుల కోసం మాత్రమే ప్రజలు బయటకు వచ్చారు. కేవలం మందులు, నిత్యావసర సరుకుల దుకాణాలు మాత్రమే తెరుచుకున్నాయి. అవి కూడా ప్రభుత్వం ప్రకటించిన సమయాల్లో మాత్రమే తెరిచి ఉంచేవారు.

కొన్ని రోజులకు లాక్ డౌన్ సడలింపులు ఇస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు బయటకు రావడం, వ్యాపారాలు పుంజుకోవడం జరిగింది. ఇదే సమయంలో ఆకలితో ఉన్న భోజన ప్రియులు రెస్టారెంట్లపై పడ్డారు. లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ లో ఏకంగా 5.5 లక్షల ఆర్దర్లు బిర్యానీ కోసం వచ్చాయి.

స్వయంగా స్విగ్గి ఓ నివేదిక వెల్లడించింది. వరుసగా నాలుగో సంవత్సరం బిర్యానీ కోసం ప్రజలు ఆన్ లైన్ లో మ‌క్కువ చూపార‌ని తెలిపింది. ఇక 3.35 లక్షల మంది బటర్ నాన్ కోసం, 3.31 లక్షల మంది మసాలా దోశ కోసం ఆన్ లెన్ లో ఆర్డర్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఎన్ని విపత్తులు వచ్చినా ఇష్టమైన మంచి వంటకాలు ఆర్డర్ చేసి తినడంలో మనవాళ్ళు ముందువరుసలో ఉన్నారని అర్థమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here