క‌రోనా స‌మ‌యంలో బాల‌య్య ఏం చేశాడో తెలుసా.

హీరో బాలకృష్ణ స్టేలే వేరు. ఇటు సీనీ రంగంతో పాటు రాజ‌కీయాల్లో సేవ చేస్తున్న ఆయ‌న వైద్య రంగంలో కూడా సేవ చేస్తున్నారు. బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్‌ ఆసుప‌త్రి ద్వారా పేద‌ల‌కు ఉచిత వైద్యం అందిస్తున్న విష‌యం తెలిసిందే.

తాజాగా క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. నిరు పేద‌ల నుంచి ధ‌న‌వంతుల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు ఇప్పుడు క‌రోనాకి భ‌య‌ప‌డిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో బాల‌కృష్ణ సినీ ఇండ‌స్ట్రీ గురించి ఆలోచించారు. వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు.

త‌న బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రి ద్వారా బాల‌కృష్ణ సినీరంగానికి చెందిన 24 విభాగాల వారికీ మందులు పంపిణీ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ వీ.వీ వినాయ‌క్ వెల్ల‌డించారు. ఇండస్ట్రీలో 24 విభాగాల‌కు చెందిన వారికి కూడా ఇవి అంద‌జేస్తున్నార‌ని తెలిపారు. క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో హోమియో మందులు, విట‌మిన్ ట్యాబ్లెట్ల‌ను ఇస్తున్నారు. ఈ సంద‌ర్బంగా బాల‌కృష్ణ‌కు వినాయ‌క్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న త‌రుణంలో ఇలా సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌డం నిజంగా సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మే. ఇదే విష‌యంపై బాల‌య్య అభిమానులు సోష‌ల్ మీడియాలో జై బాల‌య్య అంటూ కామెంట్లు పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here