‘ఆదిపురుష్’ విషయంలో తనపై వస్తోన్న వార్తలకు క్లారిటీ ఇచ్చిన అనుష్క..

యంగ్ రెబల్ స్టార్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’ అనే చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇందులో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారన్న దానిపై మాత్రం ఒక క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తల ఆధారంగా… కీర్తి సురేష్‌, కియారా అద్వానీ, ప్రియాంకా చోప్రా, అనుష్క శర్మ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. చిత్ర యూనిట్ మాత్రం అధికార ప్రకటన చేయలేదు.

ఇదిలా ఉంటే ప్రభాస్ తో పలు చిత్రాల్లో నటించి మంచి జోడీ గా పేరు సంపాదించుకున్న అనుష్క ఆది పురుష్ లో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. బాహుబలి వంటి సూపర్ హిట్ సినిమాలో నటించడం, ప్రభాస్.. అనుష్కల మధ్య మంచి స్నేహ బంధం ఉండడంతో ఈ వార్త నిజమేనని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా ఈ వార్తను నటి అనుష్క స్వయంగా ఖండించారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశబ్దం చిత్రం అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనుష్క.. ఆది పురుష్ చిత్రం గురించి స్పష్టతనిచ్చారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘నాకు అటువంటి ఆఫర్‌ ఏమీ రాలేదు. నేను ఆ చిత్రంలో నటించడం లేదు. వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు..’ అని సింపుల్ గా సమాధానమిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here