బిగ్ బాస్ హౌజ్ నుంచి నన్ను అందుకే పంపించారెమో.?

బిగ్ బాస్ రియాలిటీ షో.. గత మూడు సీజన్లలాగే నాలుగో సీజన్ లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకెళుతోంది. ఇక మూడవ వారం ఎలిమినేషన్ లో భాగంగా దేవి నాగవల్లి బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే చాలా మంది నెటిజన్లు దేవి నాగవల్లిని అనవసరంగా ఇంటినుంచి పంపించారని, బిగ్ బాస్ హౌజ్ లో ఆమె కంటే వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తన ఎలిమినేషన్ గురించి దేవి నాగవల్లి స్వయంగా మాట్లాడింది.

తాను బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకి రావడానికి గల కారణాలు వివరిస్తూ… ‘బిగ్ బాస్ చేయమన్నవి అన్ని నేను చేశాను. ఎప్పుడు కూడా రూల్స్ కు వ్యతిరేకంగా వెళ్లలేదు. నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతాను. నా వల్ల గేమ్ ప్లాన్ మారిపోతుందని. నా వల్ల స్క్రిప్ట్ ప్లాన్ మార్చాల్సి వస్తుందనే కారణంగా బిగ్ బాస్ నిర్వాహకులు నన్ను ఎలిమినేట్ చేశారేమో. నాలో ఎలిమినేషన్ లో ఉన్న వారిలో కొందరికి నా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయినా కూడా నన్ను ఎలిమినేషన్ చేశారు’ అంటూ చెప్పుకొచ్చింది దేవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here