దేశం మొత్తం టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌.. 28ఏళ్ల త‌ర్వాత తీర్పు నేడే.

1992లో జ‌రిగిన బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో చివ‌రి తీర్పు నేడు రానుంది. 28 సంవత్స‌రాల సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత నేడు తీర్పును సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం చెప్ప‌నుంది. దేశం మొత్తం ఈ తీర్పు కోసం ఉత్కంఠ‌గా ఎదురుచూస్తోంది.

ఈ కేసులో దేశంలోని ప్ర‌ముఖులు నిందితులుగా ఉన్నారు. బీజేపీ అగ్ర‌నేత ఎల్‌.కే అద్వానీతో పాటు కేంద్ర మాజీ మంత్రి ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, ఉత్త‌ర ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి క‌ల్యాణ్‌సింగ్‌, మధ్య ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ఉమాభార‌తితో స‌హా మొత్తం 49 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే ఇప్ప‌టికే 17 మంది చ‌నిపోయారు. మిగిలిన నిందితులంద‌రూ నేడు ల‌ఖ్‌న‌వూలోల‌ని సీబీఐ ప్ర‌త్యే కోర్టులో హాజ‌రుఅవుతున్నారు.

అయితే తాము నేరం చేశామ‌ని చెప్ప‌డానికి ఎలాంటి ఆధారం లేద‌ని నిందితులు చెబుతున్నారు. రాజ‌కీయ ప్ర‌తీకార చ‌ర్య‌లో భాగంగానే అప్ప‌ట్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం త‌మను కేసులో ఇరికించింద‌ని అంటున్నారు. మొత్తానికి నేడు ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఈ కేసు తీర్పు రానుంది. దీంతో దేశం మొత్తం ఈ తీర్పులో ఏం రానుందో అన్న టెన్ష‌న్ నెల‌కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here