తాప్సీ పాత్రను కొట్టేసిన అనుష్క.!

‘సూపర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నటి అనుష్క శెట్టి. అనంతరం నటించిన అరుంధతి సినిమాతో ఒక్కసారి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌ గా మారిన అనుష్క… పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ క్రేజీ ఆఫర్లతో దూసుకెళ్తోంది స్వీటీ.

ఇక ఈ అమ్మడు తాజాగా నిశ్శబ్ధం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి నిశ్శబ్ధం అనుష్కను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన కథ కాదట.. మొదట్లో దర్శకుడు ఈ చిత్రంలో తాప్సీని హీరోయిన్ గా తీసుకోవాలని భావించారట. కానీ ఒకానొక సమయంలో కోన వెంకట్ దగ్గర నిశ్శబ్ధం కథవిన్న అనుష్క.. ఈ సినిమాలో తాను నటిస్తానని చెప్పడంతో, అనుష్క ను ఓకే చేశారట. ఇలా తాప్సీ స్థానాన్ని అనుష్క కొట్టేసిందన్నమాట. ఇదిలా ఉంటే గతంలో అనుష్క హీరోయిన్ గా వచ్చిన అరుంధతి చిత్రంలో కూడా తొలుత మమతా మోహన్ దాస్ ను తీసుకోవాలి అనుకున్నారట. కానీ మమతా ఈ ఆఫర్ కు నో చెప్పడంతో.. ఈ పాత్ర అనుష్కను వరించింది. అరుంధతి చిత్రం అనుష్క కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.. మరి నిశ్శబ్ధంతో అనుష్క కెరీర్ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here