ఆయుర్వేదం గురించి అందాల భామ ఎంత బాగా చెప్పిందో చూడండి.!

పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప విద్య అయుర్వేదం. మనకు వచ్చే ప్రతీ ఆరోగ్య సమస్యకు ఆయుర్వేదంలో పరిష్కారం ఉంటుందని చెబుతారు. అయితే ఇలాంటి గొప్ప విద్య గురించి మనలో ఎంతమందికి తెలుసు చెప్పండి. పూర్వీకులు మనకు ఇచ్చిన ప్రకృతిసిద్ధమైన ఆయుర్వేదాన్ని వదిలేసి ఇంగ్లిష్‌ మందులవైపు పరుగులు తీస్తున్నాం. అయితే తాజాగా అందాల తార అమలాపాల్‌ ఆయుర్వేదం గొప్పతనం గురించి ఎంతో అద్భుతంగా వివరించారు.

ప్రస్తుతం నటి అమలాపాల్‌ పంచకర్మ అనే చికిత్సను తీసుకుంటోందట. ఆయుర్వేదంలో ఒక భాగమైన ఈ చికిత్సను గత 20 రోజులుగా తీసుకుంటోందట. మొత్తం 28 రోజుల కోర్సులో 20 రోజులు పూర్తి చేసిందీ బ్యూటీ. ఈ క్రమంలో ఈ ఆయుర్వేద చికిత్స గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది అమలా. ఆయుర్వేదంతో తన ప్రయాణాన్ని వివరిస్తూ.. ‘ఆయుర్వేదంతో నా ప్రయాణం నాలుగేళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో ఓ పుస్తకంలో దోషాలు, వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సృష్టి మొత్తం పంచభూతాల ఆధారంగా నిర్మింపబడింది. ఈ పంచభూతాలు కలసి మూడు శక్తులను సృష్టించాయి. వాటినే దోషాలంటారు. వాతా, పితా, కఫా. ఇందులో మొదటిది మన ఎనర్జీని కంట్రోల్‌ చేస్తుంది. రెండోది మన జీర్ణక్రియను, శారీరక చర్యలను చూసుకుంటుంది. చివరిది మన శరీరాకృతిని నిర్దేశిస్తుంది. ఆయుర్వేదిక ప్రక్రియలన్నీ ఈ మూడు దోషాలను సరైన క్రమంలో పెట్టి మన సమస్యలను నయం చేసుకోవడానికే. నెల రోజులుగా ఆయుర్వేదంలో పంచకర్మలో మునిగితేలుతున్నాను. నన్ను నేను తెలుసుకుంటున్నాను. మన శక్తిని మనమే తెలుసుకొని స్వయంగా నయం చేసుకోగలిగే ప్రక్రియ ఇది. ఇలాంటి ప్రక్రియలో పంచకర్మ ఒకటి’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక అమలాపాల్‌ కెరీర్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో ఓ వెబ్‌ సిరీస్‌తో పాటు, తమిళ, మలయాళం చిత్రాల్లో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here