కరోనా వేళ..  పెద్ద మనసు చాటుకున్న మెగాస్టార్. 

సినిమాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే మెగాస్టార్ చిరంజీవి పలు సేవల ద్వారా కూడా తన మంచి మనసు చాటుకుంటారు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్‌ బ్యాంక్‌తో ఎంతో మందికి సాయమందిస్తూ అండగా నిలుస్తోన్న చిరు తాజాగా తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు.
తాజాగా తన అభిమానుల సహకారంతో మరో సాయం అందించడానికి సిద్ధమయ్యారు.చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌లో భాగమైన చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా కరోనా బారిన పడిన  పేదలకు ఉచితంగా ప్లాస్మాను అందించనున్నట్లు మెగాభిమానులు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. తెల్ల రేషన్ కార్డు దారులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోగలరని మెగాభిమానులు ప్రకటించారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ సినీ కార్మికుల కోసం చిరంజీవి అధ్యక్షతన ఏర్పాటైన సీసీసీ మనకోసం సంస్థ.. నిత్యావసర వస్తువులను అందించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here