వరుస సినిమాలతో జోష్ మీదున్న ఈస్మార్ట్ భామ.. 

‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల నటి నభా నటేష్. అనంతరం రవిబాబు దర్శకత్వంలో ‘అదుగో’ చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ రెండు సినిమాలు ఈ భామకు పెద్దగా ఆశించిన విజయాన్ని అందించలేకపోయాయి. ఇక ఈ రెండు సినిమాల తర్వాత నభా నటించిన ఇస్మార్ట్ శంకర్ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోగా రామ్ అదరగొట్టాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో నభా నటేష్ రేంజ్ ఓ స్థాయిలో పెరిగిపోయింది. ఈ సినిమాలో నభా తనదైన అందం మాస్ డైలాగ్ లతో యువతను మంత్రముగ్ధుల్ని చేసింది.
ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో నభాకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘సోలో బ్రతుకే సో బెటరూ’ చిత్రంలో నటిస్తోందీ బ్యూటీ. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇక ఈ సినిమాతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ అల్లుడు అదుర్స్’ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలతో పాటు.. ‘అంధాధూన్‌’ తెలుగు రీమేక్‌లో కనిపించనుంది. . నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం. ఇలా ఒకేసారి చేతిలో ఏకంగా మూడు సినిమాలతో బిజీ హీరోయిన్ గా  మారిపోయిందీ బ్యూటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here