ట్రోల్స్ పట్ల బాధపడ్డ పాయల్.. 

తనదైన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నటి పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 చిత్రంలో నెగిటివ్ షేడ్స్ లో నటనతో పాటు..  హాట్ హాట్ అందాలతో ఆకట్టుకున్న బ్యూటీ అనంతరం పలు వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా షూటింగ్ కు దూరంగా ఉన్న పాయల్.. తాజాగా సినిమా షూటింగ్ లో తిరిగి పాల్గొంది. అయితే ఈ క్రమంలోనే సెట్స్ లోకి అడుగుపెట్టేముందు పాయ‌ల్ క‌రోనా ప‌రీక్ష‌లు జరిపించుకోగా అందులో నెగెటివ్ అని తేలింది. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తూ టెస్ట్ చేసే స‌మ‌యంలో తీసిన వీడియోని షేర్ చేసింది.

టెస్ట్ చేసే స‌మ‌యంలో పాయ‌ల్ చాలా భ‌య‌ప‌డింది, ఇంకా చెప్పాలంటే ఏడ్చేసింది.

దీంతో ఈ ముద్దుగుమ్మ పై పలువురు నెటిజన్లు ట్రోల్స్ మొదలుపెట్టారు… కరోనా పరీక్ష చేయించుకోవడం అంత పెద్ద విషయమేమీ కాదు, ఓవరాక్ష‌న్ చేయాల్సిన అవ‌స‌రం లేదంటూ కామెంట్లు పెట్టారు. దీంతో కాస్త ఫీలయిన పాయల్… ‘నాకు ఇంజక్ష‌న్స్‌, మందులు అన్నా చాలా భ‌యం. క‌రోనా టెస్ట్ స‌మ‌యంలోనూ చాలా భ‌య‌ప‌డ్డాను, కాస్త అసౌక‌ర్యానికి గుర‌య్యాను. దీనిపై న‌న్ను ట్రోల్ చేయ‌డం చాలా బాధ‌గా అనిపించిందని’ అని వాపోయిందీ అందాల తార.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here