సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన కమల్.. 

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం యావత్ సినీ జగతిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన గాన మాధుర్యంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న బాలుకు భరతరత్న ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి… బాలసుబ్రమణ్యంకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా నటుడు కమల్ హాసన్ జగన్ మోహన్ కు ఈ విషయమై కృతజ్ఞతలు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి రాసిన లేఖను ట్విట్టర్ లో షేర్ చేసిన కమల్… తమిళనాడులోనే కాకుండా దేశంలో బాల సుబ్రహ్మణ్యంను నిజంగా అభిమానించే వారంతా ఆయనకు ఈ గౌరవం దక్కాలని కోరుకుంటున్నారని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. ఇక ఇదే విషయమై బాలు తనయుడు చరణ్ మాట్లాడుతూ… తన తండ్రే తమకు పెద్ద భారత రత్న అని, ఒకవేళ ఆయనకు భారత రత్న పురస్కారం ఇస్తే స్వాగతిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here