కార్తికేయ సీక్వేల్ లో నాని హీరోయిన్.? 

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014లో చిన్న సినిమాగా విడుదలై.. మంచి విజయాన్ని సొంతం చేసుకుందీ సినిమా. దేవుడు, సైన్స్ ల కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాతో నిఖిల్ సక్సెస్ బాటపట్టాడు. ఈ సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ చిత్రానికి సీక్వేల్ ను రూపొందించే పనిలో పడ్డారు.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ కీలక పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. మరి ప్రియాంక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందా..? లేదా అతిథి పాత్రలో కనిపించనుందా.? తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here