భారీ ఆఫర్ ఇచ్చినా నో చెప్తోన్న ‘లవ్ స్టోరీ’ టీమ్.. !

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపు లతో మళ్లీ చిత్రీకరణ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఓ బడా ఓటీటీ సంస్థ ఆసక్తి చూపుతోందని సమాచారం. సినిమాను నేరుగా తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనే విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మునుపెన్నడూ లేని విధంగా ఓ భారీ ధరను ఆఫర్ చేశారని… కానీ దానికి చిత్ర యూనిట్ తిరస్కరించారని సమాచారం. ఆలస్యమైనా సరే సినిమాను నేరుగా థియేటర్లలోనే విడుదల చేయాలని ఫిక్స్ అయిన సినిమా యూనిట్.. ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా ఓటీటీ విడుదలకు నో చెబుతున్నారట. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తమ కలల్ని నిజం చేసుకోవడం కోసం హైదరాబాద్ వచ్చిన యువతీయువకుల కథగా తెరకెక్కుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here