మాస్టారుగా మారనున్న పవన్ కళ్యాణ్..!

అజ్ఞాతవాసి తర్వాత రాజకీయాల్లో బిజీగా మారడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు ప్రకటించి ఆయన అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు. ఇప్పటికే పింక్ రీమేక్.. వకీల్ సాబ్ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్న పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు కానుకగా మరో మూడు కొత్త చిత్రాలను ప్రకటించాడు.

దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో కూడా ఓ సినిమా తెరకెక్కునున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని 2021 మిడిల్ లో చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ సినిమా కథ కూడా పవన్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని సామాజిక అంశాల పైనే ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నాడని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here