డ్రంక్ అండ్ డ్రైవ్ లో పటుబడ్డ యాంకర్ ప్రదీప్ కు శిక్ష!

ప్రముఖ యాంకర్  ప్రదీప్  నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని ముగించుకుని  వస్తున్న క్రమంలో తెలంగాణ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్  విధి నిర్వహణలో  మద్యం సేవించి అడ్డంగా బుక్కయ్యారు దొరికిపోయాడు. బ్రీత్ ఎనలైజర్‌లో 170కి పైగా పాయింట్లు నమోదు కావడంతో ప్రదీప్ కారును పోలీసులు సీజ్ చేశారు. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో  యాంకర్ ప్రదీప్ విషయం లో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది.
ఈ క్రమంలో యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్సు మూడు సంవత్సరాలు రద్దు చేస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా రూ.2100 జరిమానా విధించింది.గతంలో పోలీసు కౌన్సిలింగ్ కు తన తండ్రితో కలిసి ప్రదీప్ హాజరవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కోర్టుకు కూడా తన తండ్రితో కలిసి వెళ్లాడు. మారిన ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అతనికి జైలు శిక్ష పడుతుందనే వాదన వినిపించినా.. ప్రదీప్‌కు ఈ కేసు విషయంలో కొంత ఊరట లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here