అయ్యో క‌రోనా.. భార్యభ‌ర్త‌ల‌కు ఆరడుగుల దూరం ఉండాల్సిందేన‌ట.

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ ఇప్పుడు భార్య‌భ‌ర్త‌ల‌పై కూడా ప్ర‌భావం చూపుతోంది. నెల‌లు గ‌డుస్తున్న క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతుండ‌టంతో ఆయా దేశాల ప్ర‌భుత్వాలు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. తాజాగా భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రూ భౌతిక‌దూరం పాటించాల‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది.

క‌రోనా కేసుల తీవ్ర‌త పెరుగుతున్న ప‌రిస్థితుల్లో బ్రిటీష్ ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. అందులో భాగంగా లండన్, టూ టైర్, త్రీ టైర్‌ నగరాల్లో, కరోనా తీవ్రత ఎక్కువగా ప్రాంతాల్లో భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఒకే ఇంట్లో నివ‌సిస్తున్న వాళ్లు ఎలాంటి దూర పాటించ‌కుండా ఉండొచ్చ‌ని తెలిపింది. ఎవ‌రైతే భ‌ర్త ఒక‌చోట‌, భార్య ఒక చోట నివాసం ఉంటారో వాళ్లు మాత్రం క‌లిసిన‌ప్పుడు క‌చ్చితంగా ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాల‌ని చెప్పింది.

ఉద్యోగం కోసం భార్య భ‌ర్తలు వేరే వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటుంటారు. ఇలాంటి వాళ్లు క‌లుసుకుంటున్న స‌మ‌యంలో దూరం ఉండాల‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ప‌బ్లిక్ మండిప‌డుతున్నారు. త‌మ‌ను దూరంగా ఉండాల‌ని చెప్ప‌డం క‌రెక్టు కాదంటున్నారు. త‌మ‌ను లైంగికంగా క‌లుసుకోవ‌ద్ద‌ని చెప్పే హ‌క్కు ప్ర‌భుత్వానికి లేదంటున్నారు. అయితే ప్ర‌భుత్వం మాత్రం క‌రోనా వైర‌స్ కుటుంబంలో ఒక్క‌రికి సోకినా మ‌రొక‌రికి సోక‌కుండా ఉండేందుకు ఈ నిబంధ‌న‌లు తెచ్చామ‌ని చెబుతోంది. మ‌రి ఈ నిబంధ‌న ఎంత‌వ‌ర‌కు దారితీస్తుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here