మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా.. వైసీపీ నేతలు, అధికారుల్లో టెన్షన్

ఏపీని కరోనా వెంటాడుతూనే ఉంది. సామాన్య ప్రజలు, కరోనాపై యుద్ధం చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులను వెంటాడుతోంది. ఇప్పుడు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలను కూడా టెన్షన్ పెడుతోంది. కొంతమంది మంత్రులు, వారి కుటుంబాలు.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చాలామంది ఈ వైరస్ బారినపడ్డారు. కొంతమందికి కోలుకుంటుండగా.. మరికొంతమంది కొత్తగా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు కరోనా నిర్థారణైంది.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా అనుమానంతో ఆయన టెస్ట్ చేసుకోగా పాజిటివ్‌గా తేలింది. ఆయనతో పాటు సతీమణికి కూడా వైరస్ సోకింది. ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ రావటంతో ఆయనను కలిసిన కార్యకర్తలు, నేతలు, సన్నిహితుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం అధికారులు ఎమ్మెల్యేను కలిసిన వారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు.

ఏపీలో ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సహా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిలు కరోనా బారినపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here