ఆసుపత్రి లో చేరిన నటి ఐశ్వర్యారాయ్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ ముంబై లోని నానవతి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. గత వారం అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ కాగా, అనంతరం జరిపిన కరోనా నిర్దారణ పరీక్షలలో ఐశ్వర్యా రాయ్, ఆరాధ్య లకు సైతం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఐశ్వర్యా రాయ్ పాజిటివ్ అని తెలినప్పటి నుండి హోమ్ క్వారంటైన్ లో ఉండటం జరిగింది. తాజాగా నానావతి ఆసుపత్రి లో కరోనా వైరస్ చికిత్స నిమిత్తం ఆసుపత్రి లో చేరడం జరిగింది.

ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లు కరోనా వైరస్ పాజిటివ్ చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ భారీ నుండి కోలుకుంటున్నాం అని అమితాబ్ తాజాగా వెల్లడించారు. అయితే ఐశ్వర్యా రాయ్ సైతం అదే ఆసుపత్రి లో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. కరోనా వైరస్ మహమ్మారి సినీ పరిశ్రమ లో కలవర పాటుకు గురి చేస్తుంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులకు కరోనా వైరస్ సోకగ, హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here