భారత క్రికెట్ సభ్యుడు మరియు ఆటగాడు అయినా రవీంద్ర జడేజా తన ఇన్‌స్టాగ్రాంలో ఓ ఫొటో పోస్ట్ చేయడం ద్వార అనేక విమర్శలు ఎదుర్కుంటున్నాడు …ఇంతకి ఆ ఫోటో లో ఏముంది అంటే రవీంద్ర జడేజా ఫామ్‌హౌస్‌లో సేద తీరుతూ, హుక్కా తాగుతున్న ఫొటో ఈ ఫోటో పెట్టడం తో నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు …ఓ సెలబ్రిటీ అయి ఉండి ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలా వ్యవహరించడం చాల బాధాకరమని అన్నారు.
చిన్నారులు జడేజాను ఆదర్శంగా తీసుకుంటున్నారని, ఇలాంటి ఫొటోలు పెట్టడం కారణంగా వారు అడ్డదారులు తొక్కే అవకాశాలున్నాయని హితబోధ చేశారు.మరికొంతమంది నెటిజన్లు జడేజా కి మద్దతు నిలిచారు సెలబ్రిటీ లు కూడా స్వేఛ్చ ఉంటుంది అని వారు కూడా మనలాగే మనుషులే అని వారి జీవితాన్ని వారికి నచ్చిన విధంగా అనుభవించే హక్కు వారికి ఉందని మద్దతిచ్చారు.