ఆ నొప్పి ఏంటో నాకు తెలుసు.. నువ్వు జాగ్ర‌త్త

టీం ఇండియా మాజీ క్రికెటర్ యువ‌రాజ్ సింగ్ బాలివుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. సంజ‌య్‌ద‌త్ కొద్ది రోజులుగా ఊపిరి తిత్తుల వ్యాధితో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న‌కు యూవీ కొన్ని స‌ల‌హాలు ఇచ్చారు.

సంజ‌య్ ద‌త్‌కు ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ వ‌చ్చింది. ముంబైలోని ఓ హాస్పిట‌ల్‌లో ఆయ‌న చికిత్స తీసుకుంటున్నారు. కాగా వైద్యం కోసం విరామం తీసుకుంటున్న‌ట్లు సంజ‌య్ ఇదివ‌ర‌కే చెప్పారు. త్వ‌ర‌లోనే మీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తాన‌న్నారు. త‌న ఆరోగ్యంపై వ‌దంతులు తీసుకురావ‌ద్ద‌న్నారు.
అయితే అమెరికాలో మెరుగైన వైద్య‌చికిత్స‌లు చేయించుకునేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో గ‌తంలో క్యాన్స‌ర్ ను జ‌యించిన యువ‌రాజ్ సింగ్ సంజ‌య్‌ను ఉద్దేశించి మాట్లాడారు.
ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన యువ‌రాజ్‌సింగ్ ఆ నొప్పి ఎలా ఉంటుందో త‌న‌కు తెలుస‌న్నారు. అయితే ఈ స‌మయంలో సంజ‌య్ చాలా దృఢంగా ఉండాల‌న్నారు. ఫైట‌ర్‌లాగా పోరాటం చేయాల‌న్నారు. త్వ‌ర‌గా ఈ వ్యాధి నుంచి కోలుకోవాల‌ని దేవున్ని ప్రార్థిస్తున్న‌ట్లు యువ‌రాజ్ సింగ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here