జ‌గన్ విమ‌ర్శించే అర్హ‌త ఉందా…

బ్లాక్ మెయిల్‌ చేసి ఎన్నికల్లో పది వేల ఓట్లు తెచుకున్న చరిత్ర హర్షకుమార్‌ది అని ఏపీ మంత్రి విశ్వరూప్‌ అన్నారు. దళితులపై దాడుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించినంతలాగా
ఎవ్వ‌రూ స్పందింలేద‌న్నారు.

దళిత యువకుడు ప్రసాద్ రాష్ట్రపతికి రాసిన లేఖ వెనుక హర్ష కుమార్ ఉన్నారని మంత్రి అన్నారు. ద‌ళితుల‌పై దాడులు చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపించిన‌ట్లు చెప్పారు. ఇక హ‌ర్ష‌కుమార్ ద‌ళితుల కోసం చేసిందేమీ లేద‌న్నారు. ఆయ‌న ద‌ళితుల‌ను మాస్కులాగా వాడుకున్నార‌న్నారు. హ‌ర్ష కుమార్‌ది దళిత ఎజెండా కాద‌ని.. చంద్ర‌బాబు ఎజెండా అన్నారు.

వైఎస్సార్ ద‌య‌వ‌ల్ల హ‌ర్ష‌కుమార్ ఎంపీ అయ్యార‌న్నారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ను విమ‌ర్శించే అర్హ‌త ఆయ‌న‌కు లేద‌న్నారు. జ‌గ‌న్ ద‌ళితుల ప‌క్ష‌పాతి అన్నారు. అందుకే ఒక ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి,  5 మంత్రి ప‌ద‌వులు ఇచ్చార‌న్నారు. ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్ల‌డ‌మే ఈయ‌న ప‌నిగా పెట్టుకున్నార‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here